Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంటర్ ప్రథమ సంవ్సతరం పరీక్షల ఫలి తాల విడుదలపై విచారణ జరపాలనీ, ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గం ఆధ్వ ర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాల యం ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన ప్రదర్శ న చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.పరుశురాం, గ్రేటర్ అధ్యక్షు డు వి.రియాజ్, ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు మాట్లాడుతూ అక్టోబర్లో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఫలితాల వెల్లడిపై తక్షణమే విచారణ జరిపి.. ఫెయిలైన విద్యార్థుల కు న్యాయం చేయాలన్నారు. కరోనా కాలంలో పాఠాలు చెప్పకుండా పరీక్షలు నిర్వహించి విద్యా ర్థులను తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేస్తూ.. పరోక్షంగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వం వెంటనే స్పందించి బేషరుతుగా ఫెయి లైన ప్రతి విద్యార్థినీ పాస్ చేయాలన్నారు. తక్కు వ మార్కులు వచ్చిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసుకునే అవకాశం కల్పించాలనీ, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థి ఆందోళన కార్యక్రమా లను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కె.గణేష్, సహాయ కార్యదర్శి ఎం.సైదులు, తదితరులు పాల్గొన్నారు.