Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై శుక్రవారం తెలంగాణ పెన్షనర్లు కేంద్ర సంఘం నిర్వహణలో మానస ఆర్ట్స్ సౌజన్యంతో జాతీయ పెన్షనర్లు దినోత్సవం నిర్వహించారు. కేంద్ర సంఘ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన వారిని చులకన భావంతో చూడరాదన్నారు. పదవీలో ఉన్నప్పుడు వారు సంస్థ అభివద్ధికి చేసిన కషిని గుర్తించుకొని వారికి వద్యాప్యంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. సంఘటిత శక్తి తో సమస్యలు ప్రభుత్వాల దష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించుకుంటామన్నారు. అధ్యక్షత వహించిన రాము పెన్షనర్లు నిరాశకు లోను కాకూడదని కోరారు. గాన సభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి పెన్షనర్లు సంఘానికి తమ సహకారం ఉంటుందన్నారు. ఈ సందర్బంగా ఇ. నవనీతరావు రచించిన 'గూడెం వెంకటేశ్వర శతకం' సంపుటిని మూర్తి అవిష్కరించారు. రాఘశ్రీ నిర్వహణలో 70 ఏండ్లు పైబడిన పెన్షనర్లు కు సత్కారం, కవి సమ్మేళనం జరిగాయి.