Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
దేశంలో మొదటి అతి పెద్ద సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) 2021-22 సంవత్సరానికిగాను నూతన అధ్యక్షుడిగా సీఎమ్ఏ పి.రాజు అయ్యర్, ఉపాధ్యక్షులుగా సీఎమ్ఏ విజేందర్ శర్మలు ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం హిమాయత్‌నగర్ లోని సీఎంఎ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 76 ఏండ్లుగా నుంచి సీఎమ్ఏ (అకౌంట్ నిపుణులు) వత్తి అనేది దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు. తయారీ, సేవా రంగాలలో, వ్యాపార నమూనాలను రూపొందించడంలో, వ్యాపార సంస్థల వ్యయ పోటీతత్వాన్ని సాధించడంలో సీఎమ్ఏలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఐసీఏఐ 28 మే 1959న ఇన్స్టిట్యూట్ ప్రత్యేక పార్లమెంటు చట్టం ద్వారా, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ యాక్ట్ 1959 యాక్ట్ ద్వారా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ వృత్తిని నియంత్రించడానికి ఒక చట్టబద్ధమైన ప్రొఫెషనల్ బాడీగా స్థాపించబడిందన్నారు. ఈ సంస్థ భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో నడుస్తున్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నైలలో నాలుగు ప్రాంతీయ కౌన్సిల్ లు ఉన్నాయన్నారు. భారతదేశంలో 110 ఛాప్టర్లతో పాటు 11 విదేశీ కేంద్రాలను కలిగి ఉందన్నారు. ఖర్చు తగ్గింపు, అవగాహనలతో సీఎమ్ఏలు భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తి కేంద్రంగా పరిగణించబడుతుందని తెలిపారు. వ్యాపార కార్యకలాపాలు, నిర్వహణలో సీఎమ్ఏలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయన్నారు. సమావేశంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్ కేసీహెచ్ ఏవీఎస్ మూర్తి, కె.సోమేశ్వరబాబు, పి.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.