Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓంప్రకాష్్
నవతెలంగాణ-హైదరాబాద్
కార్పొరేటర్లకు డివిజన్ లను అభివద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని గన్‌ఫౌండ్రీ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ అన్నారు. శుక్రవారం గన్ ఫౌండ్రీలోని కార్పొరేటర్ కార్యాలయంలో చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కార్పొరేటర్‌కు అభివద్ధి కోసం నాలుగు నుంచి ఐదు కోట్ల నిధులను కేటాయించే వారని గుర్తు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు పాత విధానాలకు స్వస్తి చెప్పి, కొత్త విధానాలను తీసుకువచ్చి కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు గన్ ఫౌండ్రీ డివిజన్ లో ఆరు సీసీ రోడ్లు పూర్తి చేశామని, మరో ఐదు రోడ్లు పనులు బడ్జెట్ లేకపోవటంతో నిలిచి పోయాయి అని తెలిపారు. డివిజన్లో ఆర్యకన్య పాఠశాల రోడ్డులో గల15 ఏండ్లుగా పరిష్కారం కానీ డ్రయినేజీ పైపులైను అధికారుల సమన్వయంతో పూర్తి చేశామన్నారు. ఐమాస్లైట్లు, స్ట్రీట్ లైట్స్ కూడా కొత్తవి డివిజన్ లో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులూ గమనించి డివిజన్లో పలు చోట్ల ప్లాంటర్ బాక్సులు ఏర్పాటు చేసి చెత్త సమస్యకు పరిష్కారం చూపించామని అన్నారు. కొత్త డ్రయినేజీ వ్యవస్థను, షాబాద్ బండలను బొగ్గులకుంట బిర్లా మందిర్ గౌలిగూడ ప్రాంతంలో ఏర్పాటు చేశామని తెలిపారు. గన్ ఫౌండ్రీ కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ కోసం 29 లక్షల రూపాయల బడ్జెట్ ను కేటాయించి టెండర్లు కూడా పూర్తి చేశామని అన్నారు. ప్రభుత్వం డివిజన్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ విషయంలో పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల కొన్ని కేంద్రాలలో పని చేసే ఉద్యోగులు వ్యాక్సిన్ అమ్ముకుంటున్నారని తన దష్టికి వచ్చిందని తెలిపారు. పూల్ బాగ్ తీము పార్క్ కోసం 1.5 కోట్ల నిధులు కేటాయించిన ఇప్పటి వరకు పనులు చేపట్టడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారన్నారు. ఆజాద్ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా మార్చాలని ప్రజలకు దీనిని అందుబాటులో తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అభివద్ధి విషయంపై ప్రభుత్వాన్ని తీస్తామని నిలదీస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భీష్మ ఓం ప్రకాష్, గోల్కొండ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాకేష్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.