Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ పరిధిలోని ఇంజినీరింగ్, పీజీ కోర్సుల్లో పెంచిన పీజులు వెంటనే విరమించుకోవాలని బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన విద్యార్థి సంఘాల నాయకులు వేల్పుల సంజరు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తామని చెప్పి తీరా ఇప్పుడు ఓయూ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్, టెక్నాలజీ, పీజీ కోర్సు లలో అధిక ఫీజుల పెంచి విద్యార్థులపై మోయలేని భారాన్ని పెట్టిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఓయూ జాక్ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్, అంబేద్కర్, రవి నాయక్, అంజిగౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.