Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు జంక్షన్ల వద్ద పనులను వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. జంక్షన్ల అభివృద్ధిపై ట్రాఫిక్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఎలక్ట్రీకల్, లా అండ్ అర్డర్ అధికారులతో కలిసి శుకవ్రారం ఆయన ఐడీపీఎల్ జంక్షన్ వద్ద పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జంక్షన్ల వద్ద తీసుకోవాల్సిన చర్యలను చేపట్టాలన్నారు. ఐడీపీఎల్, షాపూర్‌నగర్, సూరారం జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్, విద్యుత్ స్తంభాలు మరోచోటుకి బదిలీ, రోడ్డు వెడల్పు పనులు చేపట్టేందుకు వెంటనే సర్వే చేపట్టాలన్నారు. జంక్షన్ల అభివృద్ధికి అవసరమైన వ్యయ ప్రణాళికలు సిద్దం చేసి పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈ కృష్ణచైతన్య, ట్రాఫిక్ ఏసీపీ కె.చంద్రశేఖర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ కె.చంద్రశేఖర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రఘునందన్, డీటీ శ్రీనివాస్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు ఎర్వ శంకరయ్య, సుధాకర్, నాయకులు కె.జయరాం, భాస్కర్‌రెడ్డి, కాప సుబ్బారెడ్డి, సాయికిరణ్, రాణి, క్రాంతియాదవ్, సతీష్ గట్టోజి, ఆంజనేయులు, అల్లావుద్దీన్ పాల్గొన్నారు.