Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు, జన్మభూమి కాలనీ, శివమ్మ కాలనీ సైడ్ భాగంలో, ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ల ఆదేశాల మేరకు, డ్రోన్ యంత్రం సహాయంతో దోమల మందు పిచికారి చేయించారు. అలాగే ప్రజలు కూడా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు వారి వారి ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి నీటి నిల్వను తనిఖీ చేసి మరలా నీటిని నింపుకోవాలని సూచించారు. తమ ఇంటితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవా లన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. నాలాల్లో, చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలను, ప్లాస్టిక్ కవర్లను వేయవద్దని తెలిపారు. చెత్తను కాలనీలోనికి వచ్చే చెత్త ఆటోలోనే వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, ఎంటమాలజీ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.