Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
గత రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న రూ.3500 కోట్ల ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేసి, పూర్తి ఫీజులు మంజూరు స్కీమ్ పునరుద్ధరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆర్ కష్ణయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గత రెండేండ్లుగా 15 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలను చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి తెస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 6 లక్షల మంది ఉద్యోగుల జీతాలు రెండుసార్లు, డీఏలు పది సార్లు పెంచారని, కానీ విద్యార్థులకు స్కాలర్షిప్పులు పెంచరా అని ప్రశ్నించారు. ఇంజినీరింగ్/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/డిగ్రీ/ఇంటర్ కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులు మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో గుజ్జ కష్ణ, పగిళ్ల సతీష్, నీల వెంకటేష్, కష్ణ యాదవ్, అనంతయ్య, కూనూరు నర్సింహ గౌడ్, చంటి ముదిరాజ్, బి.సి వెంకట్, చరణ్ యాదవ్, రావుల రాజు తదితరులు పాల్గొన్నారు.