Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్ ఏరియాలో పబ్బులు, పార్టీలు, క్లబ్బులు ఎక్కువ కావడం వల్ల మందుబాబుల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. కొద్దిరోజులుగా మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ తమ ప్రాణాలనే కాదు ఎదుటివారిని రిస్క్ లో పడేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ ప్రాంతంలో మందుబాబులు కారును పల్టీలు కొట్టిస్తూ నానా బీభత్సం సష్టించారు. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో పంజాగుట్ట నుంచి నాగార్జున సర్కిల్ మీదుగా బంజారాహిల్స్ వైపు మితిమీరిన వేగంతో దూసుకుపోతున్న కారుకు ఓ స్కూటీ అడ్డొచ్చింది. స్కూటీని తప్పించే క్రమంలో డ్రైవర్ కారును డివైడర్ వైపు తిప్పారు. దీంతో కారు డివైడర్ కు ఢకొీని గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డుకు అవతలివైపు దూసుకెళ్లింది. అయినా కారు అదుపులోకి రాకుండా వేగంగా దూసుకెళ్లి మరో కారును ఢకొీట్టి ఆగిపోయింది. దీంతో కారులోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు మహ్మద్ ఆరిఫ్, ప్రణతి, దీక్ష, గ్లోరియా, సాయిలక్ష్మి, తేజస్విరెడ్డి, దుర్గా రాకేష్, గణేశ్ గాయపడ్డారు. కారు నెంబర్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ఐ20కారు ఎవరిదనేది గుర్తించే పనిలో పడ్డారు. అర్ధరాత్రి బీభత్సం సష్టించి పరారీలో ఉన్న మందుబాబుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదిలావుంటే ఈ నెలలోనే హైదరాబాద్‌లో చాలా డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 5వ తేదీ ఆదివారం రోజున మందుబాబుల వల్ల జరిగిన ప్రమాదంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 రెయిన్ బో ఆసత్రిలో విధులు నిర్వహించే అయోధ్యరారు, దేవేంద్రకుమార్ దాస్ మతిచెందారు. మద్యం మత్తులో కారు నడిపింది రోహిత్ గౌడ్‌గా అతనితోపాటు సాయి సుమన్ రెడ్డి, తప్పించుకున్న వెంకట్‌లుగా పోలీసులు గుర్తించారు. మందు బాబులు చేసే అరాచకాలు కొందరి కుటుంబాల్లో నిరాశ కలిగిస్తున్నాయి. బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని ఢకొీట్టారు.