Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
స్వస్తవ కాన్సర్ కేర్, నోవార్టిస్ సంస్థ కాన్సర్ కేర్ ఇండియా హైదరాబాద్ స్మైల్స్ అడ్వాన్స్డ్ డెంటల్ హాస్పి టల్ వారి సహకారంతో శుక్రవారం రసుల్పురాలో మహి ళలకు సంపూర్ణ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కాన్సర్ శిబిరంలో మహిళలకు గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లక్షణాలపై అవగాహన కల్పించడంతోపాటు పరీక్షలు నిర్వహించా రు. స్వస్తవ కాన్సర్ కేర్ వ్యవస్థాపక సెక్రెటరీ డాక్టర్ చతుర్వేది మాట్లాడుతూ రిటైర్డ్ ఐపీఎస్ అర్పీ .సింగ్ అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ మోహన్ కందా ప్యాట్రన్ నేతృత్వంలో ఈ కాన్సర్ శిబిరాలు స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామనీ, అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా నగరంలోని బస్తీలు, గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భవాని, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత, వైద్యులు తేజస్వి, యసశ్వీ, దీపిక, ప్రతినిధి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.