Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని దుర్గానగర్లో ఆదివారం రూ.25 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ ప్రారంభించి మాట్లాడారు. డివిజన్లోని ప్రతి సమస్యనూ దశలవారీగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా నగర్ అధ్యక్షులు నరసింహారెడ్డి, లక్ష్మయ్య, మల్లేష్, శ్రీనివాస్, రాము, కాలనీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.