Authorization
Sat March 22, 2025 10:26:56 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు వాసవీనగర్లోని సమస్యలను తెలుసుకునేందుకు ఆదివారం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మీట్ దా యూ ఆర్ మెంబెర్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొని పలు సమస్యలను రామకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. కాలనీ వాసులు చెప్పిన సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపడతామని రామకృష్ణ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.