Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
మూడు చింతలపల్లి మండలంలోని జగ్గంగూడ గ్రామ పంచాయతీ సంపన్ బోల్ గ్రామం నుంచి శ్మశాన వాటికకు వెళ్లే దారిలో వాగు పైన వంతెన నిర్మాణం కోసం సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రైతులతో కలసి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకుర మల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సభర్వాల్కు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించి వెంటనే పరిష్కారం చేయాలని కోరారనీ, తమ సమస్యపై స్పందించిన మంత్రికి గ్రామ ప్రజల తరుపున సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మూడు చింతలపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు మురళి గౌడ్, భాస్కర్ యాదవ్, జంగా రెడ్డి, నరేందర్ రెడ్డి, నర్సింలు, ప్రహాలద, స్వామి, రమేష్, సత్యనారాయణ, ముదిరాజ్ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.