Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
వికలాంగుల సమస్యల పరిష్కారానికి మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆదివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎన్.వినరు ఆధ్వర్యంలో జిల్లా నుంచి సుమారు 80 మంది వికలాంగులు చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎన్.వినరు మాట్లాడుతూ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రిజర్వేషన్ కల్పించాలనీ, వికలాంగుల పెన్షన్ను రూ.3,016 నుంచి రూ.6వేలకు పెంచాలనీ, మూడేండ్లుగా పెండింగ్లో ఉన్న పెన్షన్ను వెంటనే మంజూరు చేయాలనీ, వికలాంగులకు ఎలాంటి షూరిటీ లేకుండా రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు లోన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు 5 శాతం డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలనే వివిధ సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయి సమావేశానికి వెళ్లినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మహిళా నాయకురాలు ఎన్.శాంతాబాయి, పి.విజరు కుమార్, జి.బగయ్య, జి.సురేష్ కుమార్, షేక్.షబానా, డి.వెంకట్రావు, ఎన్.యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.