Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లి లోని తన నివాసంలో 92 మంది లబ్దిదారులకు రూ.41.10 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందించాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. వైద్య పరీక్షల కోసం రూ.వేలు ఖర్చు చేయలేక పేదలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.కోట్ల వ్యయంతో ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్‌లలో సిటీ, ఎంఆర్ఐ స్కాన్లు, క్యాత్ ల్యాబ్‌లు, ఈసీజీ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక్కడ రూ.వేల విలువైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారనీ, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద ప్రజల ముంగిటకు వైద్య సేవలు తీసుకెళ్లేందుకు, పేదలు అధికంగా నివసించే ప్రాంతాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం పొందలేకపోతున్న ఎంతో మందిని సీఎం సహాయ నిధి ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, కుర్మ హేమలత, మహే శ్వరి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ, ఆకుల రూప, ఉప్పల తరుణి పాల్గొన్నారు.