Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఓ రిసార్ట్లో పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. ఏడుగురు నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్ల భర్తలు ఉండటం గమనార్హం. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చీర్యాల గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓ రిసార్ట్లో కొందరు పేకాట ఆడుతు న్నట్టు ఎస్వోటీ ( స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అర్ధరాత్రి ఒంటి గంటకు రిసార్ట్లో స్పెషల్ టీంతో తనిఖీలు చేపట్టి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.65 వేలా 610 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు పేకాట సెట్లను స్వాధీనం చేసుకున్నారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ కార్పొరేటర్ శారద భర్త మనోదర్ రెడ్డి, నాలుగో డివిజన్ కార్పొరేటర్ నాగరాణి భర్త వెంకటేశ్ గౌడ్, మూడో డివిజన్ కార్పొరేటర్ బల్లి రోజా భర్త బల్లి శ్రీనివాస్ గుప్తా పేకాడుతూ పోలీసులకు పట్టు బడారు. వీరితోపాటు బుర్క రమేశ్, అందే సురేశ్, తాడూరి నరేశ్, రాహుల్ కూడా పోలీసులకు చిక్కారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ రిసార్టులలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వారిని, వారికి సహకరిస్తు న్న వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ న్నారు. రిసార్టులలో మద్యం, అశ్లీల కార్యక్రమాలు, రేవ్ పార్టీలు, డ్యాన్సులు, వివిధ రకాల చట్ట వ్యతిరేక కార్యక్ర మాలు చేపట్టడం చట్ట రీత్యా నేరం అనీ, యువత మత్తుకు అలవాటు పడి తప్పు తోవ పట్టే అవకాశం ఉంటుందనీ, దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.