Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/కాప్రా
కార్పొరేటర్ హామీని పట్టించుకోలేని పరిస్థి తికి రాజకీయాలు దిగజారాయనీ, మద్యం దుకా ణం తరలించాలని 23 రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందించలేని స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. అదివారం 23వ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పోరాటానికి ఆమె మద్దతు ప్రకటించి మాట్లాడారు. అదనపు మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం వల్ల స్థానికులు తమకు ఇబ్బంది కలుగుతుందని ఆందోళన చేస్తుంటే.. సర్కారు ఆదాయం కోసం తప్ప ప్రజలు, మహిళల సంరక్షణ, సంక్షేమం అవసరం లేదనట్టుగా వ్యవహరిస్తుందన్నారు. చర్లపల్లిలో మద్యం షాపు ఏర్పాటు చేయడం వల్ల అనేక అనర్థాలకు కారణమవుతుందని 23 రోజులుగా ఆందోళన చేస్తున్నారనీ, కార్పొరేటర్ మూడుసార్లకుపైగా ప్రజలను కలిసినా న్యాయం మాత్రం చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మద్యం షాపు తరలింపు ఖాయమని చెప్పి రెండు వారాలు గడుస్తున్నా, చర్యలు మాత్రం తీసుకునే పరిస్థితిలో లేరన్నారు. ఈ మద్యం షాపు తరలించే వరకు ప్రజా సంఘాల పోరాటం కొనసాగిస్తామనీ, స్థానిక రాజకీయ నాయకులు అమ్ముడు పోయిన నీతి నిజాయితీ నిస్వార్ధంగా పోరాటం చేస్తున్న తమను కొనలేరన్నారు. మద్యం షాప్ యజమాన్యం మద్దతుదారులు, ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటే మంచిదనీ, అధికార పార్టీ అశ్రద్ధను విడిచి బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఒకవేళ మద్యం షాపు ఇక్కడే కొనసాగిస్తామంటే దాడి చేయడానికి సైతం వెనక్కి పోమన్నారు. ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ మాట్లాడుతూ మద్యం తీసుకువస్తే ఏ సమయంలోనైనా అడ్డుకో వడానికి ఇక్కడి మహిళలు సిద్దంగా ఉన్నారనీ, ఇకనైనా మద్యం షాపు తరలించి, కాలనీవా సులు, ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వినోద, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాము, కొండూరి భాస్కర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బి.వెంకటేష్, ఐద్వా నాయకురాలు సఫియా, ఫెరోజ లక్ష్మి, ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ్గ అధ్యక్షులు కాశీం, ఉపాధ్యక్షులు సాయి, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.