Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీడీఎస్‌యూ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు
నవతెలంగాణ-అడిక్‌మెట్
పేద విద్యార్థులను అన్యాయానికి గురిచేసిన ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన ఇంటర్ కళాశాల బంద్‌ను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు పిలుపునిచ్చారు. ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలని, కోవిడ్ ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మొదటి సంవత్సరం విద్యార్ధులనందరిని మినిమమ్ పాస్ మార్కులతో ప్రమోట్ చేయాలని కోరారు. ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్ చేయించాలన్నారు. విద్యార్థుల మరణాలపై స్పందించని విద్యా శాఖ మంత్రిని తక్షణమే తొలగించాలని, లేకపోతే పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.