Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కథా రచయిత విమర్శకులు విహారి
నవతెలంగాణ-హైదరాబాద్
రచయిత కథా వస్తువును ఎంచుకోవడంలో ప్రాధాన్యత తెలిసి ఉండాలని ప్రముఖ కథా రచయిత విమర్శకులు విహారి అన్నారు. ఆదివారం బాగ్లింగంపల్లిలోని ఎన్జీవోస్ నెట్వర్క్ కార్యాలయంలో మేడిది సుబ్బయ్య ట్రస్టు ఆధ్వర్యంలో నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణ అధ్యక్షతన ప్రముఖ నవలా రచయిత్రి కొప్పిశెట్టి ఝాన్సీ రచించిన అనాచ్చాదిత, విరోధాభాస, గొంతు విప్పిన గువ్వ, నవలల సమీక్ష సమాలోచన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కవి, విమర్శకులు విహారి మాట్లాడుతూ జీవిత కథ, ప్రేమ, మానవ సంబంధాలు, కుటుంబ వ్యవస్థ, పురుషాధిక్య సమాజం వంటి కథా వస్తువులను ఎంచుకుని అనితరసాధ్యమైన శిల్పంతో నవలా రచన చేశారంటూ కొనియాడారు. రచయితకు కథా వస్తువును ఎంచుకోవడంలో ప్రాధాన్యత తెలిసి ఉండాలని సూచించారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరిన్నీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి భాష పరిశోధకురాలు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, ప్రముఖ కవి రచయిత అనువాదకులు ఎలనాగ, సహజకవి కళా తాటికొండ, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరం శంకర్, ఈడు సౌమ్య, నల్ల భాగ్యలక్ష్మి, డాక్టర్ స్వర్ణలత, గురుమూర్తి పాల్గొన్నారు.