Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్‌లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీవో నెంబర్ 14ను అమలు చేయడానికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పి.నారాయణ అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యాల యంలో వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం యూనియన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వాటర్ బోర్డులో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జీవో 14 ద్వారా వేతనాలు పెంచాలని కోరుకోవడం సమంజసమేనని, ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కరోనా కాలంలో ప్రతి కార్మికుడికి రూ.7500 ఇన్సెంటివ్ ఇచ్చి ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులంతా మరింత పట్టుదలతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారత్నం, సంతోష్, నాయకులు కృష్ణ, ప్రవీణ్, ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, జిట్టా జగన్, కొండలు సురేష్ తదితరులు పాల్గొన్నారు.