Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతీయ నూతన విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) బలవం తంగా అమలు చేయాలని చూడడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అన్నారు. టీఎస్‌యూటీఎఫ్ హైదరాబాద్ జిల్లా విస్తృత కమిటీ సమావేశం అదివారం దోమల్‌గూడలోని యూటీఎఫ్ భవన్లో జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఎన్ఈపీనీ బలవంతంగా అమలు చేయాలని చూడడాన్ని ఖండిస్తున్నామని.. ఇది విద్యలో కార్పొరేటీకరణ, కేంద్రీకరణకు దారితీస్తుందని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని వెంటనే విద్యా వాలంటీర్లను నియమించాలని, ఎటువంటి అవకతవకలు లేకుండా జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తిచేసి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి సింహాచలం గతేడాది కాలంగా చేపట్టిన కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టగా అన్ని మండలాల నాయకులు చర్చలో పాల్గొని ఆమోదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శారద, జిల్లా ఉపాధ్యక్షులు రేణు, కోశాధికారి రాజారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగరాజు, జిల్లా కార్యదర్శులు వినరు కుమార్, బాషా, రమేష్ బాబు, ఉదరు కుమార్, మధు సూధన్, కవిత, విద్య, వెంకటేశ్వర్లు, మండల నాయకులు రమేష్, రాజు, మధుసూధన్, జగన్నాదం, నరేష్, శివకుమార్, సిరివర్ధన్, కమల, మంజులత తదితరులు పాల్గొన్నారు.