Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
దేశ స్వాతంత్రం కోసం పిన్నవయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహావ్యక్తి అష్వాఖుల్లా ఖాన్ అని ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ అన్నారు. ఆదివారం జంగంమేట్లో అష్వాఖులా ఖాన్ వర్ధంతి సందర్భంగా ఆవాజ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం బ్రిటీిష్ పాలకుల అరాచకానికి వ్యతిరేకంగా పోరాడి 27 ఏండ్లకే ఉరితీయ బడిన అష్వాఖులా ఖాన్ త్యాగం గొప్పదని కొనియాడారు. దేశం కోసం ఉరికంబం ఎక్కడం గర్వంగా ఉందని తల్లిదండ్రులను ఓదార్చిన మహా మనిషి అని అన్నారు. ఇప్పటి పాలకులు ముస్లింలని దేశద్రోహులుగా చిత్రీకరిస్తు న్నారని, వాస్తవానికి హిందూ, ముస్లిం, సిక్కు అందరూ కలిసి చరిత్ర మరిచిపోని త్యాగాలు చేసి స్వాతంత్య్రం సాధించారని గుర్తు చేశారు. యువకులు అష్వాఖులా ఖాన్ చరిత్రను తెలుసుకొని లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమం లో ఐద్వా అధ్యక్షులు లక్ష్మమ్మ, సీఐటీయూ నాయకులు కిషన్, ఆవాజ్ నాయకులు బాబర్ ఖాన్, షేక్ యాకూబ్, మహమూద్, సాహెరాబాను తదితరులు పాల్గొన్నారు.