Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుస్తకావిష్కరణ సభలో జానో జాగో నేత సయ్యద్ నిసార్ అహ్మద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం పాతబస్తీలోని జానో జాగో సంఘం నగర కార్యాలయంలో హిందూ.. ముస్లిం ఐక్యత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహ్మద్ రచించిన ప్రధమ భారత స్వతంత్ర హిందూ ముస్లింల ఐక్యత అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. హిందూ వాది అయిన బిస్మిల్ ప్రసాద్.. ఇస్లాం వాది అయిన అస్ఫకుల్లా ఖాన్ దేశం కోసం ప్రాణాలర్పించి అమరులు అయ్యారన్నారు. అంతే కాకుండా వీరు ఇరువురు ఎంతో స్నేహంగా మెలిగి భారతదేశానికి హిందూ-ముస్లింల ఐక్యత చిహ్నంగా నిలిచారని ఆయన తెలిపారు. హిందూ, ముస్లిం ఐక్యత వంటి వీరి ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.
కార్యక్రమంలో జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి వాజిద్ హుస్సేన్, తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అస్ఫియ, తెలంగాణ రాష్ట్ర నాయకులు అబ్దుల్ రెహమాన్, నసీర్, మోయిన్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.