Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్టు స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం ఓల్డ్ మల్కాజిగిరిలోని వ్యాయామశాల వద్ద రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు పనులను కార్పొరేటర్ ప్రారంభించి మాట్లాడారు. డివిజన్లోని కాలనీల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, రోడ్ లెవలింగ్ సక్రమంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కాంట్రా క్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లెల రాము యాదవ్, మండల్ సునీల్ యాదవ్, చారి, వినోద్, శ్రీనివాస్ యాదవ్, పాపారావు, సత్తి, స్థానిక కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.