Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పార్టీ ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని టీఆర్ఎస్ అంబర్‌పేట నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి అన్నారు. నియోజకవ ర్గంలో పార్టీ కార్యకర్తలు, గులాబీ కండువా విధేయులు, ఉద్యమకారులను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలకు మంచి రోజులు ముందున్నాయన్నారు. సోమవారం అంబర్‌పేటలో తన జన్మ దినం సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబర్‌పేటలో టీఆర్ఎస్ కార్యకర్తల పట్ల చిన్నచూపు కొనసాగుతోందనీ, వారిని పట్టించుకోవడం లేదని పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. మూడేండ్లుగా ఓర్పుతో సహిస్తున్నా మన్నారు. నియోజకవర్గంలో పార్టీ విచ్ఛిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందర్ని ఒక్కటి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నుంచి ఆదేశాలు వచ్చే వరకు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతానని తెలిపారు. తాను అంబర్‌పేటలో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు నియోజకవర్గంలోని ఐదు కార్పొరేటర్ల స్థానాల్లో గులాబి పార్టీ అభ్యర్థులు విజయం సాధించారనీ, గతేడాది క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం మూడు స్థానాల్లో ఓటమి చెందడం లాంటి కారణాల్లో స్థానిక ఎమ్మె ల్యే ఒకరని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అందర్నిని కలువు కుని పోలేకపోయారని విమర్శించారు. తాను పార్టీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు మోహిన్ చెరువు అభివద్ధి, అంబర్‌పేటలో పైర్ స్టేషన్, బతుకమ్మకుంట డంపింగ్ యార్డు తరలింపు, జైస్వాల్ గార్డెన్ రెగ్యులరైజేషన్లపై తాను చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఓకే చెప్పారని గుర్తు చేశారు. వీటిలో కొన్ని పనులపై ఎమ్మెల్యే చొరవ తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పి.చంద్రమౌళిచారి, రాహుల్, శిరీష, తదితరులు పాల్గొన్నారు.