Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులవద్ద వరిధాన్యం కొనుగోలు చేసి న్యాయం చేకూర్చాలని జీహెచ్ఎంసీ మేయర గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ధాన్యంకొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా సోమావారం నగర వ్యాప్తంగా నిరసనలు, మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లో చేపట్టిన నిరసన ర్యాలీలో మేయర్ పాల్గొని మాట్లాడారు.
కంటోన్మెంట్ : సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్వద్దకంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అధ్యక్షతన మాజీ బోర్డు సభ్యులు, నాయకులు నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం రైతులు, ప్రజలకు వ్యతిరేకమైన పాలన కొనసాగిస్తోందని మండి పడ్డారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు నళిని కిరణ్, ప్రభాకర్, లోక నాదం, మాజీ కో ఆప్షన్ సభ్యులు నర్సింహా ముదిరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ టీఎన్ శ్రీనివాస్, పిట్ల నాగేష్, శర్వీన్, దేవులపల్లి శ్రీనివాస్, కిరణ్, తేజ్ పాల్, శ్రీహరి, సరిత, లతా మహేందర్, భాస్కర్, మురళీ యాదవ్, సదానంద్‌గౌడ్, కుమార్ ముదిరాజ్, దీననాద్ యాదవ్, నరహరి, నీరజ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లి : కేంద్రం వైఖరికి నిరసనగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్ విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో మరోలా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణపట్ల వివక్ష వీడి, రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మెన్ పాటిమిది జగన్మోహన్రావు, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూకట్పల్లి : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడీ గాంధీ, ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, వివేకానంద నగర్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవిలతో కలిసి గోవింద్ హౌటల్ చౌరస్తా నుంచి ఉషాముళ్లపూడి కమాన్ వరకు కేంద్రం వైఖరికి నిరసనగా నల్ల కండువాలు, బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని మోడీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మల్కాజిగిరి : మల్కాజిగిరి చౌరస్తాలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు టీఆర్ఎస్ మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షులు పిట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కేంద్రం, మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీ ఆర్ఎస్ కార్పొరేటర్లు వై ప్రేమ్ కుమార్, కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, మేకల సునీత రాము యాదవ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, జితేంద్ర నాథ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మల్కాజిగిరి టీఆర్ఎస్ నాయకులు రాము యాదవ్, కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, గుండా నిరంజన్, బద్ధం పరశురామ్ రెడ్డి, కొండల్ రెడ్డి, పిట్ల నాగరాజు, గణేష్ ముదిరాజ్, శివ, మహేష్, నర్సింగ్ రావు మాదిగ, సత్యమూర్తి, పి.వి సత్యనారాయణ, సురేష్, సత్తయ్య, సంతోష్ రాందాస్, సిద్ధిరాములు, అనిల్, లక్ష్మణ్, పల్లె విజయ కుమారి, గద్వాల జ్యోతి, అరుంధతి, రజిత, కవిత, వైశాలి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా : శివ హోటల్ మెయిన్‌రోడ్డులో కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మహిళా విభాగం కార్యవర్గసభ్యులు , సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హైదరాబాద్ : బాలానగర్, ఫతేనగర్ జంట డివిజన్ల కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్గౌడ్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. శోభనా సెంటర్లోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్రం వైఖరికి నిరసనగా చావుడప్పులు మోగించారు. మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
సరూర్‌నగర్ : టీఆర్ఎస్ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో ఇక్కడి చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు అరవింద్ శర్మ, నాయకులు వెంకట్ రెడ్డి, సాజిద్, రామాచారి, కొండ్ర శ్రీనివాస్, లింగ స్వామిగౌడ్, భూపాల్ రెడ్డి, శేఖర్, పెంబర్తి శ్రీనివాస్, వెంకటేష్‌గౌడ్, శ్యామ్ గుప్తా, పటేల్ సునీత రెడ్డి, ఊర్మిళ, ఎల్లయ్య, యాదవ రెడ్డి, శేఖర్ ,శైలజ పాల్గొన్నారు.
కంటోన్మెంట్ : ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో చౌరస్తావద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ నరేందర్‌గౌడ్, సదరన్ రైల్వే బోర్డ్ మెంబెర్ కర్రె జంగయ్య, మాజీ కౌన్సిలర్ కర్రె లావణ్య, నియోజకవర్గ అధ్యక్షుడు ఇజాజ్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, జనరల్ సెక్రెటరీ హరినాథ్, అధ్యక్షురాలు లలిత, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాప్రా : మల్లాపూర్ డివిజన్లో శివ హౌటల్ మెయిన్ రోడ్డుపై స్టాండింగ్ కమిటీ మెంబెర్, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మహిళా విభాగం కార్యవర్గసభ్యులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.