Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడ గ్రామ ప్రజలకు కష్ణ తాగు నీటిని ఉచితంగా వారానికి రెండు రోజులు అందించాలని యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి శూరకర్ణ రెడ్డి, రామిడి వీరకర్ణ రెడ్డి అన్నారు. సోమవారం హెచ్ఎండబ్యూఎస్ ఉన్నతాధికరిని కలిసి కష్ణ వాటర్ ఉచితంగా అందించాలని, కష్ణా నీటిని పెంచాలని వినతిపత్రం అందించారు. మాట్లాడుతూ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ పరిధిలోని 2, 3, 4, 5, 24, 25, 26 వార్డులలో అధికారులు గత మార్చి నుండి కష్ణ వాటర్ బిల్లు వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఇంటికి రూ.250 రూపాయలు చొప్పున బిల్లులు వేయడం జరుగుతుందని, ఆ బిల్లులు చెల్లించకపోతే నల్లా కనెక్షన్లు కట్ చేస్తామని అధికారులు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తూన్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రతిరోజు ఉచితంగా కష్ణ వాటర్ అందిస్తామని 10 వేల లీటర్ల వరకు ఉచితంగా ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ మేయర్, కార్పొరేటర్లు, నాయకులు, కేవలం నెలకు ఎనిమిది రోజులు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని విమర్శించారు. రోజు విడిచి రోజు అల్మాస్గూడ ప్రజలకు కష్ణ నీటిని అందించి ప్రజల కష్టాలు తీర్చాలని అధికారుల దష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. లేనిపక్షంలో అల్మాస్గూడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కష్ణా నీటి వినియోగదారులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.