Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంఈఓ ఆంజనేయులు
నవతెలంగాణ-కూకట్పల్లి
26 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో అవార్డులు ఎంఈఓ ఆంజనేయులు అందజేశారు. జాతిరత్నా లను తయారుచేసే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. సోమవారం రోజున కూకట్పల్లి జెడ్పిహెచ్ పాఠశాలలో, సోమ వారంనాడు జెడ్పిహెచ్ఎస్ కూకట్‌పల్లిలో నిర్వహించిన మండల ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అవార్డులు బాధ్యతలు పెంచుతాయని, విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల దేనని అన్నారు. ఈ సందర్భంగా బాలానగర్, కూకట్పల్లి మండలాల నుండి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 26 మందిని, ప్రశంసాపత్రాలు, శాలువాలు, పూలమాలలు, మొక్కలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కిషన్, సంధ్యా రెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర పీఆర్టీయూ అసోసియేషన్ అధ్యక్షులు శివరాజ్, డీజీటీియూ జిల్లా అధ్యక్షులు, నర్సింహులు, పీిఆర్టీియూ కూకట్పల్లి మండలాధ్యక్షులు నరేందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పర్మాగళ్ల నర్సింహులు, బాలానగర్ మండలా ధ్యక్షుడు బ్రహ్మానంద రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు ఎండి యాసిన్, హరీష్, అలాగే కూకట్పల్లి, బాలనగర్ మండలాల్లోని వివిధ పాఠ శాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.