Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారం గ్రామ రెవెన్యూ సర్వే నెం.127లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) మద్దతు తెలుపుతూ వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా భూమిని సర్వే చేసి ప్రభుత్వం వెలికితీసి ప్రజలకు న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. గతంలో తహశీల్దార్‌కు ఆర్డిఓకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆక్రమణదారు లపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారని వాపోయారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఒక గంటలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు , తదితరులు పాల్గొన్నారు