Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
వందేళ్ల ఓయూ స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ వెంటనే పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సోమవారం
ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజి ఆవరణలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. యూజీసీ నిబంధనల ప్రకారం న్యాక్ 'ఎ గ్రేడ్' ఉన్న వర్సిటీలు ఏటా పీహెచ్డీ అడ్మిషన్లు, భర్తీ చేసుకునే అవకాశం ఉందని, ఓయూకు న్యాక్ 'ఏ' గ్రేడ్ ఉన్నా నాలుగేండ్లుగా పీహెచ్డీ అడ్మిషన్ల భర్తీ ప్రక్రియ చేపట్టలేదన్నారు. ఇప్పటికైనా చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని అన్ని వర్సిటీలకు నిర్వహిం చాలనుకుంటున్న పీహెచ్డీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. యూజీసీ రూల్స్ ప్రకారం ఏ వర్సిటీకి ఆ వర్సిటీలోనే పీహెచ్డీ సీట్లను భర్తీ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్స్ స్టాలిన్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షలు ఆర్.ఎల్. మూర్తి, కాంపల్లి శ్రీను, రమేష్, విష్ణు, ఏఐఎస్ఎఫ్ నాయకులు గోలి హరికష్ణ, సత్య, ఉప్పల ఉదరు కుమార్, సుమంత్, ఎస్ఎఫ్ఐ నాయకులు రవి, కరణ్, విజరు, శ్రవణ్, పీడీఎస్యూ నాయకులు సుమంత్, టీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, ప్రశాంత్, మిథున్ ప్రసాద్, ఎల్ఎస్వో అశోక్, విజేందర్, గిరిజన శక్తి నాయకులు శరత్ నాయక్, నేతకానీ విద్యార్థి సంఘం నాయకులు ప్రసాద్ నేత తదితరుల పాల్గొన్నారు.