Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడిక్మెట్
పుస్తకాలు మనిషి మస్తిష్కాన్ని అమోఘంగా తీర్చిదిద్దు తాయి అని బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కష్ణమోహన్ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనశాలను అధ్యక్షులు గౌరీష్ జూలూరి గౌరీశంకర్తో కలిసి సందర్శిం చారు. అనంతరం మాట్లాడుతూ.హైదరాబాద్ నగర ప్రజలతో పాటుగా అనేక ప్రాంతాలకు సంబంధించి నటువంటి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ పుస్తక ప్రదర్శనశాలలో వారికి కావలసినటువంటి పుస్తకాలను ఖరీదు చేయడం సంతోషంగా ఉందన్నారు. పుస్తకం ప్రగతికి చిహ్నం, సమాజ మేధస్సును పెంపొందించే విషయాలు అందుకు సంబంధించిన పుస్తకం కావాలన్నా ఇక్కడ అందుబాటులో ఉంచడానికి నిర్వాహకులు విశేషంగా కషి చేశారు.
చాలా అరుదైన పుస్తకాలు అనేకం కనిపిస్తున్నాయి అని తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శన శాల వేదిక ద్వారా ఇవాళ నాలుగు మాటలు మీతో మాట్లాడే అవకాశం రావడం ఇది ఏదో జన్మలో చేసుకున్న అదష్టం గా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ఇంత గొప్పగా పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న నిర్వాహకులకు పుస్తకప్రియులు, కళాకారులు, కవులు, రచయితలు అందరికీ హదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేశారు.