Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ స్వచ్చ్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం బాగ్ అంబర్పేట డివిజన్లోని ఇంద్రప్రస్థ కాలనీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వఛ్చ్ సర్వేక్షణ్ృ 2022 అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కాలనీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో కషి చేసిన వారికి అభినందన పత్రాలను అందిజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ వారి సూచనలను పాటిస్తూ తమ ఇండ్లలోని తడి, పొడి హానికర చెత్తను వేరు వేరుగా చెత్తను తరలించే వారికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ జ్యోతిబాయి, శానిటేషన్ ఇన్చార్జి ప్రతాప్, ఎస్ఎఫ్ఐలు నరసింహ, శ్రీనివాస్, కాలనీ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, సభ్యులు సుష్మ, అనురాధ, పార్టీ నాయకులు మిర్యాల రవి, సాయి, శేఖర్, వెంకటరెడ్డి, చుక్క జగన్, జమ్మి చెట్టు బాలరాజ్, మిర్యాల శ్రీనివాస్, డి.వెంకటేష్, శ్రీహరి, రమేష్, బాలకష్ణగౌడ్, రాంరెడ్డి, నరసింహ పాల్గొన్నారు.