Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రైతులతో రాజకీయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని భారత జాతీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యదర్శి పుల్లూరి వెంకట రాజేశ్వరరావు అన్నారు. సోమవారం హిమాయత్ నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ యాసంగిలో వరి కొనుగోలు లో కేంద్రం అవలంభిస్తున్న తీరును ప్రజలు క్షమించరన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసనలు, ధర్నాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని సూచించారు. బీజేపీ నాయకులు కేంద్రంలో ఒక మాట రాష్ట్రంలో మరో మాట మాట్లాడుతూ ప్రజలు, రైతులను అయోమయంలోకి నెడుతున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.