Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
ఇండ్ల మధ్యలో వైన్ షాప్ వద్దని 12 రోజులుగా స్థానిక కాలనీలోని శ్రీ బాలాజీ నివాస్ అపార్ట్ మెంట్ మహిళలు రోజూ అర్ధరాత్రి వరకు వైన్ షాప్‌ను తొలగిం చాలని నిరసనగా ధర్నా చేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్ మౌలాలి డివిజన్ పరిధిలోని ఓల్డ్ సఫిల్‌గూడ ప్రధాన రహదారి వద్ద నూతన వైన్ షాప్ ఏర్పాటులో భాగంగా పర్మిషన్ తీసుకున్న ఓనర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కొత్త భవనంలో వైన్ షాప్‌ను ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలతోపాటు శ్రీ బాలాజీ నివాస్ అపార్ట్ మెంట్లోని మహిళలలు, పిల్లలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థాని కులు ధర్నా చేపట్టారు. 12 రోజులుగా ధర్నా చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులుగానీ తమను పట్టించు కోకపోవడం చాలా దుర్మార్గమన్నారు. ఈ వైన్ షాప్‌ను ఇక్కడి నుంచి తొలగించే వరకూ ధర్నా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సర్కిల్లోని అధికారుల కార్యాలయాల ఎదుట సైతం నిరసనలతో పాటు ధర్నాలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని మహిళలు స్పష్టం చేశారు. వైన్ షాప్ ఓపెన్ అయినప్పటి నుంచి మందు బాబులఱు రాత్రి టైంలో ఇండ్ల మధ్యలో ఉన్న అరుగుల మీద కూర్చుని మద్యం సేవించి, తినుబండారాలు అక్కడే వదిలి, ఖాళీ సీసాలను అక్కడే పగలగొట్టి వెళ్తున్నారని తెలిపారు. తినుబండారాలను సైతం అక్కడే వదిలి వెళ్లడంతో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు చెబుతున్నరు. సంబంధిత వైన్ షాప్ ఓనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న ధర్నా దగ్గరకు భవనం ఓనర్ వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారనీ, ఇదేంటని ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోండి అని బెదిరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెసిడెన్షియల్ అనుమతితో నిర్మించి, కమర్షియల్‌గా నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి (ఏసిపి) గజనద్ను కలిసి కమర్షియల్‌గా అనుమతుల్లేని భవనంలో వైన్ షాప్ నిర్వహిస్తున్న భవనం అనుమతులను పరిశీలించాలని వినతిపత్రం అందజేశారు. ఏసీపీ సానుకూలంగా స్పందించి భవనం అనుమతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమల, వసంత, రేఖ, నాగమణి, కవిత, విజయలక్ష్మి, అపర్ణ, రాధిక, వెంకటలక్ష్మి, సావిత్రి, శ్రీ బాలాజీ నివాస్ అపార్ట్మెంట్ మహిళలు, స్థానిక కాలనీలోని మహిళలు, తదితరులు పాల్గొన్నారు.