Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్ర అశోక్ మాట్లాడుతూ ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 30శాతం పీఆర్సీని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడేండ్లుగా పెండింగ్లో ఉన్న యూనిఫామ్ ఇవ్వాలనీ, ఆన్లైన్ సర్వే కోసం స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు వార ధిగా ఉంటూ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా కరోనా కాలంలోనూ ప్రజలకు సేవలందించిన ఆశాల సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా నాయకులు ఉన్ని కృష్ణ, ఆశాలు రేవతి కళ్యాణి, సుమ, జయప్రద, రాధా, భారతి, స్వప్న, కృష్ణవేణి, హేమలత, వాసంతి, జయంతి, తదితరులు పాల్గొన్నారు.