Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
విద్యార్థులందరూ శ్రీనివాస రామానుజన్ను ఆదర్శంగా తీసుకోవాలని కూకట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి అన్నారు. బుధవారం ప్రఖ్యాత భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూకట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతదేశ గణిత శాస్త్ర ప్రతిభను ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు రామానుజన్ అని కొనియాడారు. ఆయన సంఖ్యావాదానికి చెందిన పరిశోధనలు ఎంతో ప్రాముఖ్యత కలవని అన్నారు. గణిత ఉపాధ్యాయులు పి.నర్సింహులు మాట్లాడుతూ విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ను స్ఫూర్తిగా తీసుకొని గణితంలో బాగా రాణించాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులచే గణిత శాస్త్ర ఉపాధ్యాయులు గణిత గుర్తులు ం,-,.... రామానుజన్ నెంబర్ 1729 ఆకారంలో కూర్చోబెట్టి వివిధ గణిత పరిక్రియలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు మంజుల వాణి, ధమయంతి, శ్రీనివాసులు. ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.