Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్
వైద్యరంగంలో తెలంగాణను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీశ్‌రావు అన్నారు. రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివద్ధి సంస్థ చైర్మెన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం కోఠి డీఎమ్హెచ్ఎస్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ఆయనకు పూల బోకే అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివద్ధి సంస్థ చైర్మెన్‌గా అవకాశమివ్వడం సీఎం కేసీఆర్ నమ్మకానికి నిదర్శనమని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మంత్రి హారీశ్‌రావు మార్గదర్శకంలో వైద్యరంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కషి చేస్తానన్నారు.