Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచారహక్కు చట్టాన్ని ఆయుధంగా మార్చుకొని అవగాహన కార్యక్రమాలతో పాటు, గ్రామ స్థాయి నుంచి జాతీయ స్ధాయిలో పాలనలో జరిగే ప్రతి అంశాన్ని సాధ్యమైనంత మేరకు ప్రజలకు తెలిసే ప్రయత్నం చేస్తోందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని తర నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం పాటుపడే యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వేలవేల ప్రజల అభివద్ధి ప్రశ్నించే గొంతుకగా నిలవాలని తెలిపారు. ఏఏ శాఖలో అవినీతి అధికంగా ఉందో ఆయా శాఖల్లో సాంకేతికతను మరింత పెంపొందించడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వ్యవస్థాపకుడు రాజేందర్, మీడియా ఇన్చార్జ్ జయరాం, కొమటి రమేష్ బాబు, మణిదీప్, చెరుకూరి జంగయ్య, సారా, డా. స్రవంతి, వి గంగాధర్, హరి ప్రకాష్, కానుగంటి రాజు, కె. దేవేందర్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.