Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సుచిత్రా కొంపల్లి లోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులు పాల్గొని క్రీస్తు పుట్టుక నాటక ప్రదర్శన ద్వారా అద్భుతంగా ప్రదర్శించారు, వేడుకల్లో భాగంగా సాంప్రదాయ వస్త్రాలతో చేసిన నత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ నరిశెట్టి సుందరరాజు మాట్లాడుతూ క్రీస్తు పుట్టుక వత్తాంతాన్ని విద్యార్థులకు వివరించారు. క్రీస్తు బోధించిన ప్రేమ , శాంతి, సంతోషం అందరి కుటుంబాలలో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ నరిశెట్టి సరిత, పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.