Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బుధవారం గోల్నాక డివిజన్లోని అన్నపూర్ణ నగర్‌లోని బెథెల్ గాస్పేల్ చర్చ్‌లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో వెంకటేష్ పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవులకు ప్రధానమైన క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో లీడ్ పాస్టర్ కె.సుధాకర్, యూత్ పాస్టర్ జి.వరకుమార్, జి.ఏసురత్నం, బి.నరసింహ, టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.