Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
హుస్సేన్ సాగర్ నాలా పరివాహక బస్తీలైన సబర్మతి నగర్, అరుంధతి నగర్లో ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకుండా తోడుంటానని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హామీ ఇచ్చారు. బుధవారం హుస్సేన్ సాగర్ నాలో పరివాహక బస్తిలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినరు కుమార్తో కలిసి పర్యటించారు అనంతరం ప్రజలతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడే నాలా లోతు తీయించడం, బండరాళ్ల తొలగింపు, శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని నూతనంగా నిర్మించామన్నారు. బడుగు, బలహీన, దళిత, మైనార్టీకి చెందిన ప్రజలు ఎలాంటి హానీ తలపెట్టకుండా నాలా రిటర్నింగ్ వాల్ నిర్మించాలని, లేకుంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నగర యువ నాయకులు ఎ.వినరు కుమార్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, రాజు, ఉమేష్, పాల శ్రీను, సత్తి రెడ్డి, సాయికుమార్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, సంతోష్, తులసి, సంధ్య రాణి, పూర్ణ, సబర్మతి నగర్ బస్తి నాయకులు జి.నర్సింగ్ రావు, యాదగిరి, జగన్ గౌడ్, జీవైగిరి, చందు, కుమార్, గౌస్, రవి, యాసిన్ అలీ పాల్గొన్నారు.