Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ఆధునిక సమాజ మేలుకొలుపునకు పుస్తకాలే నాంది పలుకుతాయి అని ప్రముఖ కవి శివారెడ్డి తెలిపారు. కవాడిగూడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 34వ హైదరాబాద్ జాతీయ బుక్ ఫెయిర్లో సీతారామ అధ్యక్షతన చిందు ఎల్లమ్మ వేదికపై పసునూరు శ్రీధర్ బాబు రచించిన 'నిదురపోని మెలకువ చెప్పిన కల కవిత' సంపుటిని ప్రముఖ కవి కే శివరెడ్డి అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా లక్ష్మణ్ ఏలే, కవిత్వ విమర్శ పరామర్శ, సిద్ధార్థ మెర్సీ, మార్కెలేట్ కోడూరి విజయకుమార్, నిర్వహణ కవి యాకూబ్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాసే వాక్యం కవిత్వం చేయ్యలని ధ్యాన యోగి అయిన శ్రీధర్ ఆది భౌతిక అంశాన్ని కవిత్వీకరించారు అని తెలిపారు. శ్రీకాంత్ ఎంఎస్ నాయుడు సిద్దార్ధ లాంటి వాళ్లు గొప్ప ప్రయోగాలు చేశారు. భౌగోళిక అంశాలను తీసుకొని స్టాక్చర్ గొప్పగా రాశారని చెప్పారు. శ్రీధర్ బాబు కవిత్వంలో అనేక అంశాలను సోదాహరణలతో చదివి వినిపించారు. 2020ని జయించడానికి కవిత్వం ఆయుధం అయ్యిందని స్మిత్ అనే అమోరికన్ కవయిత్రి ఆ దిశగా సాగుతామని అన్నారు.