Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
దుండిగల్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన విద్యార్థులు సుమారు 200 బందాలు గా పాల్గొని తమ ఆవిష్కరణను వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా ఎల్ వి. నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల వారు పడుతున్న కష్టానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణ కనుగొని వారికి స్వయం ఉపాధి అందించే విధంగా ఆవిష్కరణలు ఉండాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల చైర్మెన్ మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించడానికి యాజమాన్యం ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రాజెక్ట్‌కి శాఖల వారీగా నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఈ కార్యక్రమం జ్యూరీ మెంబర్లుగా వివిధ శాఖల హెచ్ఓడీ లు, డీన్స్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ సీహెచ్. సత్తిరెడ్డి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్రెజరర్ బి రాజేశ్వరరావు పాల్గొనగా కార్యక్రమ కన్వీనర్లుగా డా . ఏం పాల ప్రసాద్ రెడ్డి, డా. సీహెచ్ శ్రీనివాసులు, వి. రాఘవేందర్ వ్యవహరించారు.