Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి, జాతీయ ఓబీసీ కమిషన్‌కు ఆరె కులస్తుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో ఓబీసీ కమిషన్ చేపట్టిన కులాల విచారణకు ఆరె కులసంఘం ప్రతినిధులు హాజరై సంబంధిత వివరాలను అందించారు. కమిషన్ సభ్యులు ఆచారికి సంబంధిత వివరాలను అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి తమ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని కోరారు. కమిషన్‌ను, కేంద్ర మంత్రిని కలిసినవారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టిపల్లి శివాజీ, ప్రతినిధులు దిగంబరావు, జెండా రాజేష్, మనోహలు ఉన్నారు.