Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు వినతిపత్రం అందజేయాలని ఆర్ట్స్ కాలేజీనుంచి బయలుదేరిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులు మాట్లాడుతూ గత కొన్నేండ్లుగా పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేయకుండా యూజీసీ నిబంధనలు తుంగలో తొక్కడం హాస్యాస్పదం అన్నారు. యూనివర్సిటీ అధికారులు పీహెచ్డీ ఆశావహులు అయిన విద్యార్థులు పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పోరాటం చేస్తున్న పెట్టుకోకుండా ఉండటం సమంజసం కాదన్నారు. గవర్నర్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేస్తు వినతిపత్రం అందజేయటం కోసం వెళ్తుంటే అరెస్ట్ చేయడం తగదన్నారు. అరెస్ట్ అయిన వారిలో నల్గొండ అంజి, గోలి హరిక్రిష్ణ, శరత్ నాయక్, రవి, బాబు మహాజన్, శ్రీకాంత్ యాదవ్, తిరుమలేష్, విజరు, ఆనంద్,మంజుల శివ, సత్య ఉన్నారు.