Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
దేశంలోని ఎస్సీల ఐక్యతకు మారుపేరు మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు, డాక్టర్ బాబా సాహెబ్ వారసులు స్వర్గీయ పీవీ రావు అని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకష్ణ కొనియాడారు. మాలమహానాడు ఆధ్వర్యంలో బుధవారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారత సంస్థ రాష్ట్ర కార్యాలయంలో పీవీ రావు 16వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్బంగా శ్రీకష్ణ మాట్లాడుతూ..దాదాపు 20 ఏండ్లుగా ఎస్సీల ఐక్యత, అభివద్ధి, హక్కుల రక్షణ కోసం నిరంతరంగా పోరాటం చేసిన పి.వి రావు ఎప్పటికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శంకర్, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి అంజి, నాయకులు ఎం.కుర్మయ్య, సంగమల కుర్మయ్య, మహిళా విభాగం నాయకులు సంగమల చంద్రకళ, తలారి జ్ఞానేశ్వరి, జెట్టి దేవలక్ష్మి, పి.లక్ష్మీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశా