Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
తిమ్మడి నాగరాజు, లెనిన్ రాజు, విప్లవ రాజు లకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘానికి ఎలాంటి సంబంధం లేదు అని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ వెల్లడించింది. ఈమేరకు పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ నాయకులు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. పీడీఎస్యూ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా తిమ్మిడి నాగరాజు, లెనిన్ రాజు, విప్లవ రాజు పత్రికల్లో ప్రకటన చేశారు అని తెలిపారు. ఈ ప్రకటన ఆవాస్తవమైనదని, రాష్ట్ర కమిటీకి ఎలాంటి సంబంధం లేని వీరి ప్రకటనను విద్యార్థులు, ఇతర విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఎవ్వరూ ఎంత మాత్రం విశ్వసించ రాదని స్పష్టం చేసింది. ప్రకటించుకున్న కమిటీ కేవలం వ్యక్తులుగా తమ స్వార్థపూరిత అవసరాల కోసం వేసుకున్న పేపర్ మీది కమిటీగానే చూడాలని కోరుతున్నాం అన్నారు. తమ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న అబద్ధపు ప్రకటనగా చూడాలని ఉద్యమకారులకు, ప్రజలకు, విద్యా సంస్థల యజమానులకు మరోసారి స్పష్టీకరిస్తున్నాం అని తెలిపారు.