Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
మీటర్లు బిగించకుండా అక్రమంగా జారీచేసిన నల్లా బిల్లులు ఉపసంహరించుకోకపోతే బిల్లులు రద్దు చేసే వరకు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నల్లా బిల్లులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం తుంకుంట మున్సిపల్ కాంగ్రెస్ అద్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సైనిక్ పూర్ హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం హెచ్ఎం డబ్ల్యూ ఎస్ డీజీఎం సాయినాథ్ వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ అధికారులు అస్తవ్యస్తంగా నీటి బిల్లులు జారీ చేశారని బిల్లుల పై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని వాటన్నింటిని నివత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మురళీగౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు అశోక్, కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు హరిగోపాల్, సేవాదళ్ అధ్యక్షులు కొండల్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు జాఫర్, జాయింట్ సెక్రెటరీ జగన్, నాయకులు జగదీష్ గౌడ్, మల్లేష్ గౌడ్,బాబు, నాగిరెడ్డి, పాండు, యూత్ కాంగ్రెస్ నాయకులు గౌతమ్ గౌడ్, రాకేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.