Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ నాయీబ్రాహ్మణ యువశక్తి సేవాసంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏం జ్యోతిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు వికాస్ కుమార్ ఆమెకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో మహిళ అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నాయీ బ్రాహ్మణ మహిళల హక్కుల కోసం కషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో యువశక్తి రాష్ట్ర కార్యనిర్వాహణ అధికారి రాఘవేందర్ నాయీ, కోశాధికారి చంద్రశేఖర్ నాయీ, గ్రేటర్ అద్యక్షులు ముత్యాల ఆంజనేయులు నాయీ, కవాడిగుడ అధ్యక్షులు సతీష్ నాయీ తదితరులు పాల్గొన్నారు.