Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఐఎన్నగర్, బీహార్ బస్తీలో గురువారం సాయంత్రం కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ సెర్చ్) ప్రోగ్రాం నిర్వహించారు. మల్కాజిగిరి పోలీసులు, ఎస్ఓటీ ట్రాఫిక్, స్పెషల్ టీమ్స్ ఇలా దాదాపు 200 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొని బస్తీలో తనిఖీలు చేశారు. ఇల్లీగల్‌గా గుట్కాలను అమ్ముతున్న షాపును సీజ్ చేశారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటో, ఒక రౌడీషీటర్,12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు మల్కాజిగిరి ఏసీపీ శ్యాం ప్రసాద్ తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాముఖ్యతను కాలనీ లోని స్థానికులకు వివరించారు. సీసీ కెమెరాలు కావాలని, రాత్రిపూట యువకులు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్లు, వాటిని అరికట్టాలని, నైట్ టైంలో పెట్రోల్ వెహికల్‌ను తిప్పాలని స్థానికులు తమ దష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. సమస్యలన్నీ పరిష్కరించేందుకు కషి చేస్తామని స్థానికులకు చెప్పినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గౌతంనగర్ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, స్థానిక నాయకులు, స్థానిక బస్తీవాసులు పాల్గొన్నారు.